Skip to main content

నా గురించి...

     నా పేరు సంజీవ్ కుమార్ దండెంరాజు. నేను గవర్నమెంట్ కాలేజీ రాజమండ్రిలో ఫిజిక్స్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. పుట్టింది పెరిగింది గుంటూరు జిల్లా. డిగ్రీ విజయవాడ పీబీ సిద్ధార్థ కాలేజీ. M .Sc. ఫిజిక్స్ రాజమండ్రిలోనే . (అదే కాలేజీలో ఇప్పుడు లెక్చరర్ గా పనిచేస్తున్నాను.) తరువాత M .Tech . Computational  Techniques ఇన్ Physics , PhD  Physics హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో. రెండు సంవత్సరాలు హైదరాబాద్ విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాలలో సేవలందించిన తర్వాత Postdoc  కి వెళ్ళాలి అనుకునేలోపు DL  నోటిఫికేషన్ రావటం క్వాలిఫై అవ్వటం జాయిన్ అవ్వటం చకచకా జరిగిపోయాయి.
     ఇక పోతే ఈ బ్లాగ్ ముఖ్యోద్దేశం విద్యావిధానం లో కంప్యూటర్ యుగానికి కార్పొరేట్ యుగానికి మధ్య విద్యనందించే ఉపాధ్యాయులు విద్యనభ్యసించే విద్యార్థులు పర్యవేక్షించే తల్లిదండ్రులు ఏం సాధిస్తున్నారు ఏం కోల్పోతున్నారు ఏం కావాలనుకుంటున్నారు అనే అంశాలలో నాకు అర్ధమైన నాకు తోచిన విషయాలను నాకు తోచిన విధంగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను. ఇవి ఎవరిని నొప్పించటానికి ఇబ్బంది పెట్టటానికి రాసేవి కావు. నచ్చినవాళ్ళే ఫాలో అవ్వగలరు...



Comments

Popular posts from this blog

ప్రస్తుత విద్యావిధానం లో భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్...

చదువుల గురించి కొందరు ప్రముఖులు చెప్పిన మాటలు... (అందులో నాకు సందర్భోచితంగా అనిపించినవి ...) విద్య అనేది విజ్ఞతను పెంచి తద్వారా సమాజ పునర్నిర్మాణానికి ఉపయోగపడే ఒక ఆయుధం... (మహాత్మా గాంధీ) విద్య అంటే జరిగిపోయిన విషయాలను తెలుసుకోవటం కాదు... బుద్ధి వికసించే విధంగా ఆలోచనలను పెంపొందించే ఒక శిక్షణ... (ఐన్ స్టీన్ ) మనం బళ్ళో చదువుకున్న అన్ని విషయాలు మర్చిపోయిన తర్వాత కూడా మన దగ్గర మిగిలివుండేదే నిజమైన విద్య  (ఐన్ స్టీన్ ) విద్యా విధానం అనేది తీక్షణమైన మరియు వివేచనాత్మకమైన ఆలోచనాధోరణి ని పెంపొందించాలి. విద్య యొక్క నిజమైన ఉద్దేశ్యం వివేకం మరియు శీలము లను పెంపొందించటమే... (మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్) విద్య అనేది పుస్తకాల్లో ఉండేది మాత్రమే కాదు మానసిక వికాసానికి  ఉపయోగపడేది ఏదైనా విద్యగానే పరిగణించాలి... ఆ విధంగా చూస్తే ప్రపంచంలో మన "మానవ వికాస సూచిక" (Human Development Index ) ఎక్కడ ఉందొ చూద్దాం ... https://en.wikipedia.org/wiki/List_of_countries_by_inequality-adjusted_HDI మానవ వికాసంలో భారతదేశం 101వ స్థానంలో ఉంది. అదే పట్టికలో మనం ఊహించ...