చదువుల గురించి కొందరు ప్రముఖులు చెప్పిన మాటలు... (అందులో నాకు సందర్భోచితంగా అనిపించినవి ...) విద్య అనేది విజ్ఞతను పెంచి తద్వారా సమాజ పునర్నిర్మాణానికి ఉపయోగపడే ఒక ఆయుధం... (మహాత్మా గాంధీ) విద్య అంటే జరిగిపోయిన విషయాలను తెలుసుకోవటం కాదు... బుద్ధి వికసించే విధంగా ఆలోచనలను పెంపొందించే ఒక శిక్షణ... (ఐన్ స్టీన్ ) మనం బళ్ళో చదువుకున్న అన్ని విషయాలు మర్చిపోయిన తర్వాత కూడా మన దగ్గర మిగిలివుండేదే నిజమైన విద్య (ఐన్ స్టీన్ ) విద్యా విధానం అనేది తీక్షణమైన మరియు వివేచనాత్మకమైన ఆలోచనాధోరణి ని పెంపొందించాలి. విద్య యొక్క నిజమైన ఉద్దేశ్యం వివేకం మరియు శీలము లను పెంపొందించటమే... (మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్) విద్య అనేది పుస్తకాల్లో ఉండేది మాత్రమే కాదు మానసిక వికాసానికి ఉపయోగపడేది ఏదైనా విద్యగానే పరిగణించాలి... ఆ విధంగా చూస్తే ప్రపంచంలో మన "మానవ వికాస సూచిక" (Human Development Index ) ఎక్కడ ఉందొ చూద్దాం ... https://en.wikipedia.org/wiki/List_of_countries_by_inequality-adjusted_HDI మానవ వికాసంలో భారతదేశం 101వ స్థానంలో ఉంది. అదే పట్టికలో మనం ఊహించ...